Header Banner

భారత్‌ను ఎదుర్కొనే ప్రణాళికలో పాక్ అప్రమత్తం! నోటామ్ జారీ, గగనతలంపై నిషేధం!

  Wed Apr 30, 2025 19:09        India

భారత్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి (26 మంది పౌరులు మృతి) అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ క్రమంలో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని (పీఓకే) గిల్గిత్, స్కార్డు నగరాలకు అన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ బుధవారం ప్రకటించింది. జాతీయ గగనతల భద్రతా ప్రమాణాలను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా పాకిస్థాన్‌లోని ఇతర ఉత్తర ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వారు తెలిపారు.

అంతేకాకుండా, భారత్ మీదుగా వచ్చే విదేశీ విమానాల రాకపోకలపై కఠిన నిఘా ఉంచాలని పాకిస్థాన్ పౌర విమానయాన అథారిటీకి (సీఏఏ) ఆదేశాలు జారీ అయ్యాయి. పహల్గామ్ దాడి అనంతరం వాఘా-అటారీ సరిహద్దు మూసివేత, పాక్ దౌత్యవేత్తలను వెనక్కి పంపడం, పాక్ పౌరులకు సార్క్ వీసాల రద్దు, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి భారత్ తీసుకున్న నిర్ణయాలకు ప్రతిస్పందనగా తాము కూడా చర్యలు తీసుకుంటున్నామని పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ) సమావేశం అనంతరం వెల్లడించింది.

ఇప్పటికే భారత విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని పాకిస్థాన్ మూసివేసింది. ఈ మేరకు నోటీస్ ఫర్ ఎయిర్‌మెన్ (నోటామ్) జారీ చేసి, నెల రోజుల పాటు భారత విమానాలపై నిషేధం విధించింది. ఈ ఆంక్షలు భారత సైనిక, వీఐపీ విమానాలకు కూడా వర్తిస్తాయి. మరోవైపు, అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహించిన అత్యవసర మీడియా సమావేశంలో పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ మాట్లాడుతూ.. రాబోయే 24 నుంచి 36 గంటల్లో భారత్ తమపై దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఇది కూడా చదవండి: రాజు పైలట్.. రాణి ప్యాసింజర్.. ఓ విదేశీ టూర్.. కఠినమైన ల్యాండింగ్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Pakistan #IndiaTensions #NOTAM #AirspaceBan #POK #IndoPak #PahalgaamAttack #Geopolitics